కరీంనగర్ రూరల్, నవంబర్ 19: మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడికతీయడంతో పూర్వవైభవం వచ్చిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలోని రాజసముద్రం చెరువు నింపేందుకు ఫీడర్ చానల్ నిర్మాణ పనులకు శనివారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, కాళేశ్వరం జలాలతో జిల్లా సస్యశ్యామలమైనట్లు తెలిపారు.
ఫీడర్ చానల్ పనులు 20 రోజుల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్, అధికారులకు సూచించారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ఉచిత కరెంట్, పెట్టుబడి సాయం అందించడంతో పాటు కాళేశ్వరం జలాలతో పంటలు పుష్కలంగా పండుతున్నట్లు తెలిపారు. ధాన్యానికి ప్రభుత్వానికి గిట్టుబాట ధర కల్పిస్తుండడంతో రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో భూగర్భజలాలు పెంచేందుకు మానేరు వాగుపై 5 చెక్‌డ్యామ్‌లు, ఇరుకుల్ల వాగుపై 4చెక్ డ్యామ్‌లు నిర్మించినట్లు తెలిపారు. తెలంగాణ సంపదను దోచుకునేందుకు ఢిల్లీ నాయకులు పాదయాత్రలు చేస్తున్నారని, ప్రజలు వారిని నమ్మవద్దన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు పురుమల్ల శ్రీనివాస్, జక్కం నర్సయ్య, దబ్బెట రమణారెడ్డి, నందయ్య, భూమయ్య, రుద్ర భారతి, ఎంపీటీసీలు అంకమల్ల శ్రీనివాస్, బుర్ర తిరుపతి, నాయకులు మంద రాజమల్లు, జువ్వాడి రాజేశ్వర్‌రావు, ఐలయ్య, గంట శంకరయ్య, మారుతి, రుద్ర రాములు, తుల బాలయ్య, రమేశ్, కూర నరేశ్‌రెడ్డి, కూర శ్యాంసుందర్‌రెడ్డి, పంది తిరుపతి, కందుల రమేశ్, గోనే నర్సయ్య, గంగయ్య, పబ్బతి రంగారెడ్డి, గడ్డం శ్రీరాములు, ఎల్లా గౌడ్, పద్మశాలీ సంఘం నాయకులు దూడం మల్లేశం, దావు రాజిరెడ్డి, దాసరి ఆంజనేయులు, కార్నాటి చెల్మయ్య, ఆరెల్లి శ్రీనివాస్, దుడం లక్ష్మీరాజ్యం, మెతుకు సత్యం, వలుస భద్రయ్య, సాయి, ప్రకాశ్, వెంకట్, సూర్యశేఖర్, నర్సింగ్, వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.