గంభీరావుపేట, నవంబర్ 14: గంభీరావుపేట కేజీ టూ పీజీ క్యాంపస్‌లో సోమవారం నిర్వహించిన లేజర్ షో అదిరింది. జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా గివ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ డే వేడుకలు, లేజర్స్ షో అలరించాయి. విద్యార్థులు ఆద్యంతం కేరింతలతో సందడి చేశారు. ఆట బొమ్మలు, బెలూన్ బొమ్మలతో ఆడుతూ సరదాగా గడిపారు. చిన్నారులకు అల్పాహారం, ఐస్‌క్రీం, చాక్లెట్, పాప్ కార్న్ ఉచితంగా అందించారు. డిజిటల్ స్క్రీన్ ద్వారా లఘు చిత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు హాజరై మాట్లాడారు. నేటి బాలలే రేపటి బావి పౌరులని, బాలలతోనే బంగారు భవిత నిర్మాణం జరుగుతుందన్నారు. మంత్రి కేటీఆర్ సహకారంతో మండల కేంద్రంలో కేజీ టూ పీజీ క్యాంపస్‌ను రాష్ట్రంలో ఆదర్శంగా ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోనే ఆదర్శంగా ఒకే ప్రాంగణంలో అంగన్వాడీ నుంచి మొదలుకుని పీజీ వరకు అన్ని విద్యాలయాలను ఏర్పాటు చేసుకున్న క్యాంపస్‌లో గివ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ వేడుకలు నిర్వహించడం ఈ ప్రాంత విద్యార్థుల అదృష్టమన్నారు. బాలలతోనే బంగారు భవిత నిర్మాణం అవుతుందన్న ముందు చూపుతో ఒకే సముదాయంలో విద్యా భవనాలు, క్రీడా మైదానం, సకల వసతులు కల్పించుకున్నామన్నారు. ఇక్కడ గివ్ తెలంగాణ ఫౌండేషన్ ప్రతినిధి కొండూరి సంకేత్రావు, ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, ఏఎంసీ చైర్పర్సన్ సుతారి బాలవ్వ, జడ్పీకోఆప్షన్ సభ్యుడు అ హ్మద్, తదితరులు ఉన్నారు.