ముకరంపుర, నవంబర్ 11:కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై ఈడీ, ఐటీ దాడులు చేసి ఏం తేల్చాయో చెప్పాలి. మంత్రి మీద బురద జల్లాలనే ఆలోచనతోనే ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి. ఇంటి తలుపులు తెరిచి ఏదో తప్పుడు పనిచేసినట్లు ప్రపంచానికి చిత్రీ కరించారు. బీజేపీకి మతం, మత విద్వేషాలు.. పిల్లలను ఆగం పట్టించడం తప్పితే సమాజం, దేశం అభివృద్ధి గురించిన ఆలోచనలు ఏ మాత్రం లేవు. రామగుండం ఎరువుల కర్మా గారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి పీఎంవో నుంచి సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం లేదు. సంబంధిత శాఖ మంత్రి లేఖ రాసి ‘మీరు హాజరుకండి..’ అని ప్రజలకు చెప్పినట్లు సీఎంను కూడా పిలిచారు. అది కూడా పోస్టు ద్వారా ఆహ్వానం పంపించారు తప్ప. ప్రధాన మంత్రి కార్యాలయం ఆహ్వానించలేదు.
2016 లో పీఎం రాష్ర్టానికి వచ్చినప్పుడు పీఎంవోతో ముఖ్యమంత్రి కేసీఆర్ మినిట్ టు మినిట్ ప్రోగ్రాం గురించి చర్చించారు. గజ్వేల్‌లో మిషన్ భగీరథ, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్‌కు శంకుస్థాపన చేయించి, మిషన్ కాకతీయను చూపించాం. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ కంపెనీకి ప్రధాన మంత్రి వస్తే స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ మంత్రు లతో ఎయిర్‌పోర్టుకు వెళ్లే కార్యక్రమం పెడితే ఒక పోలీసు, సీఎస్‌ను మాత్రమే పంపించాలని ఎవరూ రావద్దని పీఎంవో కార్యాలయం రాసింది. ఇదేనా ఒక సీఎంకు ఇచ్చే మర్యాద?. దీనిపై పదిసార్లు ప్రశ్నించినా పీఎంవో ఇప్పటికీ జవాబు చెప్పడం లేదు. ప్రధానమంత్రిది సంకుచిత మనస్తత్వం. బండి సంజయ్ ఎంపీగా, బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఏం చేశావో చెప్పాలి. నేను ఎంపీగా ఉన్న సమయంలోనే కరీంనగర్లో జాతీయ రహదారులకు ఆమో దం చేయించా.
కరీంనగర్-వేములవాడ-సిరిసిల్ల-కామారెడ్డి-పిట్లం, ఎల్కతుర్తి- హుజూరాబాద్- సిద్దిపేట-మెదక్ రహదారిని 2016లోనే ఆమోదింపజేశాం. కరీంనగర్-వీణవంక- జమ్మికుంట, భూపాలపల్లి- టేకుమట్ల- సిరొంచ రోడ్డు ఆమోదం పొందింది. సిద్దిపేట-సిరిసిల్ల-వేములవాడ-కథలాపూర్-కోరుట్ల రోడ్డు ఇన్ ప్రిన్సిపుల్ సాంక్షన్ అయి ప్రధాన మంత్రి కార్యాలయంలోని నీతి ఆయోగ్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాసి వీటిని డిక్లేర్ చేయించాలి. భద్రాచలం-సత్తుపల్లి రైల్వే లైన్‌కు రూ.670 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటా యించింది. రామగుండం నుంచి మణుగూరు వయా భూపాలపల్లి, తాడ్వాయి-ఏటూరు నాగారం-మంగపేట-మణుగూరు, రామ గుండం-హైదరాబాద్ రోడ్డును జాతీయ రహ దారిగా డిక్లేర్ చేయించాలి. రాష్ట్రంలో పండిన వడ్లను కొనరు. రాష్ర్టానికి రావాల్సిన డబ్బులు ఇవ్వరు. అప్పు తెచ్చి వడ్లు కొంటున్నాం. వారం రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తున్నాం. అయినా కేంద్రం రాష్ర్టాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నది.