కరీంనగర్ కమిషనరేట్‌కు అరుదైన గౌరవం దక్కింది. బ్లూకోల్ట్స్, పెట్రోకార్, ఇన్వెస్టిగేషన్, తదితర విభాగాల్లో ఉత్తమ పనితీరుకు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. అత్యవసర సమయాల్లో తక్షణ సాయం అందించడం, నేరాల శోధన, బాధితులకు భరోసా కల్పించడం, ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు మరింత చేరువకావడం వంటి మొత్తం 12 విభాగాల్లో ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా, సిబ్బందిలో హర్షం వ్యక్తమవుతున్నది.
రాంనగర్, అక్టోబర్ 29 : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది. పోలీసుల పనితీరులో వేగం పెంచి, ప్రజలకు సకాలంలో సత్వరమైన ఏకీకృత సేవలు అం దించే లక్ష్యంతో డీజీపీ మహేందర్ రెడ్డి ఏర్పా టు చేసిన పలు విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. గతంలోనే బ్లూకోట్స్ నుంచి మొదలుకొని కమ్యూనిటీ పోలీసింగ్ దాకా 18 విభాగాలను ఏర్పాటు చేశారు. ఆయా విభాగాల పనితీరును పరిశీలించేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ఒక సెంటర్‌ను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పలు సూచనలు సలహాలు ఇస్తూ, అత్యుత్తమమైన సేవలు అందించిన జిల్లాలు, విభాగాలను కమిషనర్లను ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమం లో 12 విభాగాల్లో రాష్ట్రంలోని వందలాది పోలీస్స్టేషన్లు పోటీపడ్డా కరీంనగర్ కమిషనరేట్‌కు మొదటి స్థానం దక్కింది.
ఈ విభాగాన్ని ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏ ర్పాటు చేశారు. ఆ ఠాణాను కొన్ని సెక్టార్లుగా విభజించి ఆయాచోట్ల 24 గంటలు మూడు షిఫ్టులలో పనిచేసేలా సిబ్బందిని నియమించారు. ఏదైనా సంఘటన జరిగినపుడు ఫోన్‌కాల్ అందిన వెంటనే 2 నిమిషాల్లో సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులకు తోడ్పాటు అందించే అవకాశం కలిగింది. ఈ బ్లూకోల్ట్స్ వ్యవస్థ వల్ల ప్రజలకు సత్వరమైన, వేగవంతమైన సేవలు అందుతున్నాయి. ఈ విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కొన్ని వందల పోలీస్ స్టేషన్లు పోటీపడ్డా కరీంనగర్ కమిషనరేట్ ప్రథమ స్థానంలో నిలిచింది.
ప్రజల అవసరాలను, స్థానిక సమస్యలను గుర్తిం చి వాటికి పరిషారం చూపడమే కాకుండా ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో నేరాలను నిరోధించేందుకు ఏర్పాటు చేసిందే కమ్యూనిటీ పోలీసింగ్. ప్రజలతో పోలీసులు మమేకం కావడం వల్ల ఎన్నో నేరాలు ముందుగానే అరికట్టేందుకు వీలుకలుగుతున్నది. నిత్యం సిబ్బంది సీపీ సత్యనారాయణ మార్గదర్శనంలో అడిషనల్ డీసీపీ చంద్రమోహన్ పర్యవేక్షణలో ప్రజలతో మమేకమై పనిచేస్తుండ డం, మంచి ఫలితాలు రాబడుతుండడంతో రా ష్ట్రంలోనే 12విభాగాల్లో ప్రథమస్థానం దక్కింది.