Mega Blockbuster | మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఏకంగా రూ.375 కోట్లు వసూలు చేసి చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది.
అయితే థియేటర్లలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. వెండితెరపై రికార్డుల వేట ముగించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ అదే స్థాయి హవా కొనసాగిస్తోంది. ఫిబ్రవరి 11న ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సినిమా, కేవలం 24 గంటల్లోనే 200 మిలియన్ల వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించి సరికొత్త రికార్డును నమోదును చేసింది. ఓటీటీ చరిత్రలో ఒక్కరోజులో ఈ స్థాయిలో ఆదరణ పొందడం విశేషమని సంస్థ ప్రతినిధులు వెల్లడించగా, మెగాస్టార్ మ్యాజిక్ థియేటర్లలోనే కాదు డిజిటల్ స్క్రీన్లపై కూడా తిరుగులేదని అభిమానులు సంబరపడుతున్నారు.