నల్లగొండ : రాష్ట్రంలో రెండు కార్పోరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఇటీవల పోలింగ్ జరిగింది. ఇవాళ కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఓ ట్రాన్స్‌జెండర్ విజయం సాధించారు.
ట్రాన్స్‌జెండర్ శ్వేత సుధాకర్ చిట్యాల మున్సిపాలిటీలోని 1వ వార్డు నుంచి బరిలో దిగారు. ఎన్నికల ప్రచారంలో శ్వేత సుధాకర్ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా సుధాకర్ ఇచ్చిన హామీలు ఓటర్లను ఆకట్టుకున్నాయి. దాంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను కాదని ఓటర్లు శ్వేత సుధాకర్‌ను గెలిపించుకున్నారు.