Kozhikode Grandmaa | ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి వయస్సుతో సంబంధం లేదని, తప్పును ప్రశ్నించే ధైర్యం ఉంటే ఎవరైనా ‘హీరో’ అవ్వొచ్చని ఒక బామ్మ నిరూపించింది. కేరళలోని కోజీకోడ్‌లో ఒక వృద్ధురాలు రాంగ్ రూట్లో దూసుకొస్తున్న ద్విచక్ర వాహనదారుడిని అడ్డుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
అసలేం జరిగింది?
కోజీకోడ్ నగరంలో రద్దీగా ఉండే రోడ్డుపై ఒక వ్యక్తి ట్రాఫిక్ నిబంధనలను బేఖాతరు చేస్తూ రాంగ్ రూట్లో వేగంగా వస్తున్నాడు. అదే సమయంలో ఫుట్‌పాత్‌పై నడుస్తూ వస్తున్న ఒక బామ్మ ఆ వాహనదారుడు రాంగ్ రూట్లో రావడం చూసి అతడిని అడ్డుకుంది. వాహనానికి సరిగ్గా ఎదురుగా నిలబడి అతడిని ముందుకు వెళ్లనివ్వకుండా ఆపేసింది. ఆ వ్యక్తి ఆమెను పక్కకు తప్పుకోవాలని సైగ చేసినా ఆమె మాత్రం ఏమాత్రం భయపడకుండా.. నిబంధనలకు విరుద్ధంగా వచ్చి నన్నే తప్పుకోమంటావా? అన్నట్లుగా అక్కడే నిలబడింది. చివరకు ఆ వాహనదారుడు తన తప్పు తెలుసుకుని, వాహనాన్ని వెనక్కి తీసుకుని సరైన మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. అయితే ఈ సంఘటనను ఒక నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు, దీంతో ఈ ఘటన క్షణాల్లో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ బామ్మపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సూపర్ బామ్మ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
An elderly woman in Kozhikode, Kerala, bravely stopped a scooty rider from misusing the footpath and sent him back to the road.
Her civic sense and determination truly deserve appreciation. pic.twitter.com/f5XEo52l7n— MN (@NizzUtd) February 12, 2026