Municipal Elections | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 11 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. జహీరాబాద్, కేసముద్రం, కోహిర్, దేవరకద్ర, అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామ, ఆసిఫాబాద్, జమ్మికుంట, జిన్నారంలో హంగ్ ఏర్పడింది. హంగ్ నేపథ్యంలో ఈ మున్సిపాలిటీల్లో స్వతంత్రులు కీలకం కానున్నారు.
ఇక 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీనిస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 876 వార్డుల్లో గెలుపొందగా.. బీఆర్ఎస్ 462 వార్డుల్లో, బీజేపీ 138 వార్డుల్లో విజయం సాధించింది. ఇక గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది.