తిమ్మాపూర్ రూరల్, అక్టోబర్ 10: మానసిక వ్యాధితో బాధపడుతున్న పిల్లలను కంటికిరెప్పలా చూసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి సుజయ్ తల్లిదండుల్రకు సూచించారు. సోమవారం ప్రపం చ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ, 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని ఉజ్వల పార్క్ సమీపంలో ఉన్న మనోవికాస్ పాఠశాలతో పాటు ఎల్ఎండీలో ఉన్న మానసిక వికలాంగుల పాఠశాలలను ఆయన సందర్శించారు.
పాఠశాలల్లో ఉన్న వసతులను పరిశీలించిన ఆయన సిబ్బందితో మా ట్లాడారు. అలాగే విద్యార్థులను సమస్యలు అడిగి తెలసుకున్నారు. ఉపాధ్యాయులు, సిబ్బందికి సూ చనలు చేశారు. చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 జిల్లా కోఆర్డినేటర్ ఆవుల సంపత్ మాట్లాడుతూ.. ఇలాంటి పిల్లలకు కూడా హక్కులు ఉంటాయని, వీరికి అన్ని సమకూర్చాలన్నారు. ఏదైనా ఆపద వస్తే హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. న్యాయవాది తిరుమల దేవి, ప్రిన్సిపల్స్, టీచర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మానకొండూర్ రూరల్, అక్టోబర్10: మండలంలోని పోచంపల్లిలో గల మోడల్ స్కూల్ లో చల్మె డ వైద్యవిజ్ఞాన కళాశాల ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మానసిక సంఘర్షణ ఒంటరితనం దరి చేరకుండా మానసిక విద్యార్థులకు ప్రొఫెసర్లు సూచించారు. అలాగే విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించగా, ప్రతిభ చూపిన విద్యార్థులు తనూజ వర్థన, శ్రీవర్షిణి, అక్షయలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ అస్వన్ గడ్డల, డాక్టర్ రవికుమార్, డాక్టర్ ఉత్తమ్, డాక్టర్ కీర్తి, ప్రిన్సిపాల్ ఎం అర్చన, సిబ్బంది పాల్గొన్నారు.