గంభీరావుపేట, అక్టోబర్ 10: మండలంలోని లింగన్నపేటలో సోమవారం వేంకటేశ్వరస్వామి రథోత్సవం కనులపండువలా సాగింది. ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు ఉదయాత్పూర్వం ఐదు అంతస్తుల రథంపై నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామ వీధుల్లో ఉత్సవమూర్తులను రథంపై ఉంచి ఊరేగించారు. మహిళలు మంగళహారతులిచ్చి స్వాగతం పలికారు.
భక్తుల గోవిందనామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. చిన్నారులు, మహిళలు కోలాటాలతో ఆకట్టుకున్నారు. నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు హాజరై ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొంతినేని చైతన్య, ఎంపీటీసీ రేణుక, ఉపసర్పంచ్ దుబాసి రాజు, ఆలయ కమిటీ చైర్మన్ దొంతినేని పాపారావు, వేదపండితులు వ్యాసోజ్జుల రామశర్మ, రాధాకృష్ణ, గోపీకృష్ణ, దేశపతి సుదర్శన శర్మ, నేతలు లింగన్నగారి దయాకర్రావు, వెంకట్రావు, చారి, రమేశ్, అంజయ్య, చింతల కిష్టయ్య ఉన్నారు.