కార్పొరేషన్, అక్టోబర్ 9: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ పిచ్చిలేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని, ఆయన్ను ఎర్రగడ్డలో చేర్చి ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఉందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చురకలంటించారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కదని స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్‌లోని మంత్రి గంగుల కమలాకర్ మీ సేవా కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎన్నో యాగాలు, యజ్ఞాలు చేశారని గుర్తు చేశారు.
యాగాలకు, క్షుద్రపూజలకు తేడా తెలియని బండి సంజయ్ అమ్మవారి భ క్తుడు ఎలా అయ్యాడో అర్థం కావడం లేదన్నా రు. కరీంనగర్ నియోజకవర్గానికి ఏమీ చే యలేని బండి సంజయ్ మునుగోడు పోయి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. కేంద్రం నుంచి అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా తీసుకురాలేని ఆయన తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని వి ధంగా రాష్ట్రంలో కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. పేదలను బాగు చేసేందుకు కేసీఆర్ పాటుపడుతుంటే, బీజేపీ మాత్రం ప్రభుత్వాలను కూల్చి అధికారం చేజిక్కించుకోవాలని కుట్రలు పన్నుతున్నదని ధ్వజమెత్తారు.
ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. యాద్రాది లాంటి పుణ్యక్షేత్రాన్ని నిర్మించిన కేసీఆర్‌పై ఇష్టారాజ్యాంగా విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని, వెంటనే బండి సంజయ్ తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పాలని, లేకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దమ్ముంటే బండి సంజయ్ కరీంనగర్‌లోని అమ్మవారి దేవాలయానికి రావాలని, అక్కడే సీఎం కేసీఆర్ రాష్ట్రం కోసం ఏం చేశారో తాను చెబుతానని, బండి సంజయ్ బీజేపీ ప్రజల కోసం ఏం చేసిందో చెప్పాలని సవాల్ చేశారు. మునుగోడు ఎన్నికలు కేవలం తన కాంట్రాక్టులు కాపాడుకొవటానికి, ఈడీ నుంచి రక్షించుకొవటానికి మా త్రమే వచ్చాయన్నారు. తన డబ్బులు కాపాడుకునేందుకే రాజగోపాల్ బీజేపీలో చేరి అవసరం లేని ఉప ఎన్నికలు తీసుకువచ్చారన్నారు. ము నుగోడులో టీఆర్ఎస్(బీఆర్ఎస్) గెలుపు ఖా యమన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, టీఆర్ఎస్ నేత దూలం సంపత్ ఉన్నారు.