తిమ్మాపూర్ రూరల్, అక్టోబర్ 9: ఆస్తి కోసం ఓ కూతురు దారుణానికి తెగబడ్డది. తన భర్తతో కలి సి కన్నతల్లిని హత్య చేయించింది. తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ మహిళ హత్యకేసు మి స్టరీ వీడింది. 48 గంటల్లోనే పోలీసులు కేసును ఛే దించారు. ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎల్ఎండీ ఠాణాలో ఏసీపీ కరుణాకర్‌రావు, తిమ్మాపూర్ సీఐ శశిధర్‌రెడ్డి, ఎల్ఎండీ ఎస్ ఐ ప్రమోద్‌రెడ్డితో కలిసి ఆదివారం వివరాలు వెల్లడించారు.
రామకృష్ణకాలనీకి చెందిన గుజ్జుల సులోచన(49)-సత్యనారాయణ దంపతులకు తేజశ్రీ అనే బిడ్డ ఉన్నది. బిడ్డ పుట్టిన కొంతకాలానికే సత్యనారాయణ మృతి చెందాడు. సులోచన భర్త నుంచి వచ్చిన ఆరు ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ బిడ్డను పెంచి పెద్ద చేసింది. తేజశ్రీ అదే గ్రామానికే చెందిన కొమ్మెర అరుణేందర్ను ప్రేమ వివాహం చేసుకున్నది.
ఆ పెళ్లి ఇష్టం లేని సులోచన అప్పటి నుంచి బిడ్డను దూరం పెడుతూ వస్తున్నది. ఈ క్రమంలో అరుణేందర్ చేపల పెం పకం, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు తల్లి నుంచి వారసత్వంగా తేజశ్రీకి రావాల్సిన ఆ స్తిపై కన్నుపడింది. ఆస్తి రాసియ్వాలని సులోచనను తేజశ్రీ రెండేళ్ల నుంచి ఒత్తిడి తెస్తుండగా ఆమె నిరాకరిస్తూ వస్తున్నది. దీంతో సులోచనను హతమార్చేందుకు తేజశ్రీ, భర్త అరుణేందర్రెడ్డి, మామ కొమ్మెర కిష్టారెడ్డి పథకం పన్నారు.
రామకృష్ణకాలనీలోని ఉపఘ్న హోమ్స్‌లో నివసిస్తున్న గోదావరిఖనికి చెందిన అరవింద్‌ను సంప్రదించారు. సులోచనను చంపితే తమ చేపల చెరువులను అప్పగిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అరవింద్ కరీంనగర్లో ఉంటున్న నాగిరెడ్డి నికిత్ స హాయంతో మూడు నెలల నుంచే చంపేందుకు యత్నిస్తున్నాడు. దసరా పండుగ సందర్భంగా ప్లాన్ ప్రకారం.. తేజశ్రీ తన తల్లి సులోచన ఇంటికి చేరుకున్నది. గురువారం అర్థరాత్రి దాటిన తర్వా త అరవింద్, నికిత్ ఇంటికి రాగా తేజశ్రీనే కిచెన్ డోర్ తీసి తల్లిని చూపించింది.
హత్య జరిగిన అ నంతరం భర్తకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. సులోచనను చంపుతుండగా అడ్డుకున్న ఆమె తల్లి కొమ్మెర రాధవ్వపై కూడా కత్తులతో దా డి చేశారు. తేజశ్రీ భర్త ఏమీ తెలియనట్టు వచ్చి రా ధవ్వను దవాఖానకు తరలించారు. కేసు నమో దు చేసిన పోలీసులు విచారణలో భాగంగా హతురాలి తల్లి రాధవ్వను పోలీసులు విచారించారు. గతంలో తన బిడ్డకు, మనుమరాలు, ఆమె భర్తకు జరుగుతున్న ఆస్తి వివాదం గురించి తెలిపింది. దీంతో పోలీసులు తేజశ్రీ, ఆమె భర్త అరుణేందర్రెడ్డిపై నిఘా ఉంచారు.
టెక్నాలజీని ఉపయోగించి వారిని విచారించగా, చంపించింది తామేనని ఒప్పుకున్నారు. ఈ కేసులో అరుణేందర్రెడ్డి, తేజ శ్రీ, శనిగరపు అరవింద్, నాగిరెడ్డి నికిత్, మరో మై నర్, తేజశ్రీ మామ కొమ్మెర కిష్టారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి ఆల్టోకారు, రెండు బైక్‌లు, ఆరు సెల్ఫోన్లు, కత్తు లు స్వాధీనం చేసుకున్నారు. కాగా కేసును ఛేదించిన పోలీసులు, క్రైంబ్రాంచ్ సిబ్బందికి పోలీసు ఉన్నతాధికారులు రివార్డులు అందజేశారు.