కమాన్‌చౌరస్తా, అక్టోబర్ 2: దేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. నగరంలోని మహాశక్తి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో సరస్వతీ పూజ, పల్లకీ సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. గాయత్రీనగర్‌లోని గణేశ్ శారదాశంకరాలయంలో పంచామృతాభిషేకం, కుంకుమార్చన, సరస్వతీ పూజలు చేశారు. పాతబజార్‌లోని గౌరీ శంకరాలయం, వావిలాలపల్లిలోని శ్రీహనుమత్ సహిత కనకదుర్గ ఆలయంలో, సంతోష్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగు శ్రీనివాస్-వసంతలక్ష్మి దంపతులు చిన్నారులకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. దుర్గాదేవి మండపాల్లో సాయంత్రం దీపాలంకరణ చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, అక్టోబర్ 2: కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి విగ్రహాన్ని పల్లకీలో ఉంచి భక్తులు ఊరేగించారు. ఈ వేడుకల్లో సర్పంచ్ గాజుల వెంకటమ్మ, ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్‌రావు, వార్డు సభ్యులు వేముల రాంచందర్, గాజుల హరికృష్ణ, మాజీ ఉపసర్పంచ్ కోరుకంటి వేణుమాధవరావు, రాజ్‌కమల్, ప్రసాద్, మల్లేశ్, బుర్ర రమేశ్‌గౌడ్, రవీందర్, గాజుల శ్రీనివాస్, సంపత్ పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, అక్టోబర్ 2: కరీంనగర్ రూరల్ మండలం నగునూర్‌లోని దుర్గాభవానీ ఆలయంలో దేవి నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం అమ్మవారు సరస్వతీ దేవి అలంకరణలో హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి వేద పండితుడు పురాణం మహేశ్వర శర్మ, అర్చకుడు పవనకృష్ణ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. పూజల్లో కార్పొరేటర్ వంగల శ్రీదేవి, పవన్, ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, ఆలయ కమిటీ బాధ్యులు నీరుమల్ల తిరుపతి, మధుసూదన్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.