చొప్పదండి, జనవరి 28: చొప్పదండి మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్‌గా అప్‌గ్రేడ్ అయిన తర్వాత జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నీతానై వ్యవహరించారు. టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణాభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చా రు. ఇదే విషయంపై సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తూవచ్చారు. ఇప్పుడు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (టీయూఎఫ్ఐడీసీ) ద్వారా రూ.33కోట్లు మం జూరు చేయించి మాట నిలబెట్టుకున్నారు.
సెంట్రల్ లైటింగ్‌తో కొత్తందాలు
చొప్పదండి మున్సిపల్‌గా అప్‌గ్రేడ్ అయిన తర్వాత టీఆర్ఎస్ బల్దియా పీఠాన్ని దక్కించుకున్నది. ఎన్నికల్లో డ్రైనేజీలు, ఫుట్‌పాత్‌లు, రోడ్ల వెడల్పు తదితర పనులు చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే సెంట్రల్‌లైటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం రూ. 33 కోట్లు మంజూరుకావడంతో అభివృద్ధి పనులపై ఆశలు చిగురించాయి. త్వరలోనే చొప్పదండి ఝాన్సీ విద్యాలయం నుంచి నవోదయ విద్యాలయం వరకు 4 కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. 50 ఫీట్లతో రోడ్లు వెడల్పు చేయనుండడంతో పట్టణం కొత్తరూపు సంతరించుకుంటుందని ప్రజలు సంతో షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం
చొప్పదండి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభు త్వం రూ. 33 కోట్లు మంజూరు చేయడంపై పాలకవర్గసభ్యులు, టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజాభూమారెడ్డి, టీఆర్ఎస్ మండల, పట్టణాధ్యక్షులు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, లోక రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో చొప్పదండి మునిసిపల్ అభివృద్దికి 33కోట్ల నిధులు మంజూరీ చేయడంపై హర్శం వ్యక్తం చేస్తూ మునిసిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ-భూమారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మశ్రీనివాస్రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోకరాజేశ్వర్రెడ్డిల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నిధులు మంజూరుకు కృషి చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుకరవీందర్, మార్కెట్ వైస్ చైర్మన్ కొత్తగంగారెడ్డి, కౌన్సిలర్లు మాడూరి శ్రీనివాస్, కొత్తూరి మహేశ్, నాయకులు నలుమాచు రామక్రిష్ణ, మచ్చ రమేశ్, గుర్రం హన్మంతరెడ్డి, బత్తిని సంపత్, అజ్జు, ఖాజు, మావూరం మహేశ్, దండెక్రిష్ణ, కొత్తూరి నరేశ్, గోవులకొండ శ్రీనివాస్, కొత్తపల్లి లక్ష్మణ్‌బాబు, డేవిడ్, మధు తదితరులు పాల్గొన్నారు.
రుణపడి ఉంటాం
చొప్పదండి మున్సిపల్ అభివృద్ధికి రూ.33 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు రుణపడి ఉంటామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ నిధుల మంజూరు పత్రాలను అందించిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ నిధులతో మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారు. ఓపెన్‌జిమ్‌లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, సెంట్రల్‌లైటింగ్, రోడ్ల వెడల్పు తదితర పనులకు వినియోగిస్తామని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే కృషితోనే నిధులు
చొప్పదండి మున్సిపల్ అభివృద్ధికి రూ. 33 కోట్ల మంజూరులో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కృషి మరువలేనిది. మేం అధికారం చేపట్టినప్పటి నుంచి పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ను కలిసి విన్నవించారు. కరోనా కారణంగా నిధుల మంజూరు కాస్త ఆలస్యమైంది. ఈ నిధులతో సెంట్రల్‌లైటింగ్, రోడ్ల వెడల్పు తదితర అభివృద్ధి పనులు చేపడతాం.
-గుర్రం నీరజ, చొప్పదండి మున్సిపల్ చైర్పర్సన్