ముత్తారం, సెప్టెంబర్18: బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ భరోసా ఇచ్చారు. హరిపురం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త తాడూరి మొగిలి మృతి చెం దగా, ఆయన మృతదేహానికి జడ్పీ చైర్మన్ ఆదివారం నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేశనపల్లి గ్రామానికి చెందిన చుంచు ఓదెలు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అడవిశ్రీరాంపూర్‌లో తోట గట్టమ్మ సంవత్సరీకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట ఎంపీపీ జక్కుల ముత్తయ్య, జడ్పీటీసీ చెలుకల స్వర్ణలత-అశోక్ యాదవ్, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు అత్తె చంద్రమౌళి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు నూనె కుమార్, సర్పంచులు వేల్పూరి సంపత్‌రావు, తుంగాని సమ్మయ్య యాదవ్, టీఆర్ఎస్ నాయకులు బియ్యని సదానందం, మధు, తాత బాలు యాదవ్, గట్టు రమేశ్, భూపెల్లి మొగిలి, కో ఆప్షన్ సభ్యుడు తదితరులు పాల్గొన్నారు.
మంథని రూరల్, సెప్టెంబర్ 18: చిల్లపల్లిలో ఆసరి కొమురయ్య, ఆరె కొమురయ్య, అక్కపాక రామక్క, అమ్మ పోచమ్మ, అసంపెల్లి పోచమల్లు ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబాలను జడ్పీ చైర్మన్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
సుల్తానాబాద్ రూరల్, సెప్టెంబర్ 18: సుల్తానాబాద్ మండలం కనుకుల సర్పంచ్ పోలు అంజయ్య తండ్రి కొమురయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. కొమురయ్య మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ సింగిల్‌విండో చైర్మన్ కోట వీణ రాజమల్లారెడ్డి, నాయకులు మైలారం నారాయణ, కర్రె కుమారస్వామి, చెట్టిఅశోక్, మీస శ్రీనివాస్, తుమ్మ రాజేశం, మల్యాల శ్రీనివాస్ గరిగంటి కుమార్, నేరెళ్ల మల్లేశ్, సాయిలు, రాజేశం, సతీశ్, రమేశ్, కాంపెల్లి రాజేశం, బొల్లం కుమార్, రాము, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.
కాల్వశ్రీరాంపూర్, సెప్టెంబర్18: ఇద్లాపూర్ గ్రామానికి చెందిన అక్కల శ్యామల ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా శ్యామల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.