చొప్పదండి, సెప్టెంబర్ 18: సీఎం కేసీఆర్ ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతున్నారని, రాజకీయాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆవరణలో ఆదివారం 39 మంది లబ్ధిదారులకు రూ.23.12 లక్షల విలువైన సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అలాగే మండలంలోని ఆర్నకొండకు చెందిన బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు గంటల రమణారెడ్డి తండ్రి గోవిందారెడ్డి కాలుకు శస్త్రచికిత్స జరుగగా సీఎం రిలీఫ్‌ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ మేరకు మంజూరైన రూ.3.52 లక్షల విలువైన చెక్కును ఎమ్మెల్యే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఆర్థిక సాయం అందిస్తున్నదని గుర్తు చేశారు. పార్టీలకతీతంగా పేదలకు అండగా నిలిచి ఆదుకుంటున్నదని కొనియాడారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, మాజీ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచులు వెల్మ నాగిరెడ్డి, గుంట రవి, దామెర విద్యాసాగర్‌రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు గడ్డం చుక్కారెడ్డి, మండల కోఆర్డినేటర్ గుడిపాటి వెంకటరమణారెడ్డి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ గన్ను శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్ కొత్తూరి మహేశ్, నాయకులు నలుమాచు రామకృష్ణ, మాచర్ల వినయ్, చీకట్ల రాజశేఖర్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, గాండ్ల లక్ష్మణ్, ఏనుగు స్వామిరెడ్డి, మహేశుని మల్లేశం, బత్తిని సంపత్, బీసవేని రాజశేఖర్, మావూరం మహేశ్ పాల్గొన్నారు.