మెట్పల్లి, జనవరి 23: అతడు పంచ్ విసిరితే ప్రత్యర్థి హడలెలత్తాల్సిందే.. పోటీ ఏదైనా గెలుపు దక్కాల్సిందే.. రింగ్‌లో దిగితే బంగారు పతకం పట్టాల్సిందే.. మెట్‌పల్లికి చెందిన బెజ్జారపు మురళి కిక్ బాక్సింగ్‌లో రాణిస్తూ ప్రశంసలందుకుంటున్నాడు.. రాష్ట్ర, జిల్లాస్థాయి క్రీడల్లో సత్తాచాటుతున్నాడు. రెండేండ్లలో రాష్ట్రస్థాయి పోటీల్లో ఏకంగా మూడు గోల్డ్‌మెడల్స్ దక్కించుకొని నేటి తరం క్రీడాకారులకు స్ఫూర్తినిస్తున్నాడు.