జమ్మికుంట రూరల్ జనవరి 20 : సీఎం కేసీఆర్ పేదల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేరొన్నారు. వెంకటేశ్వర్లుపల్లి గ్రామంలోని వెంకటేశ్వర ఫంక్షన్హాల్లో గురువారం దళితబంధు పథకం అమలును హర్షిస్తూ సర్పంచ్ బోయిని రాజ్‌కుమార్, పాలకవర్గం ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలిచి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని చెప్పారు. ప్రపంచం గర్వించదగ్గ పథకం దళితబంధు అని పేరొన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కోరారు. అనంతరం నియోజకవర్గ ఇన్చార్జి మాట్లాడుతూ…. అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. రైతాంగానికి అండగా నిలిచి రైతుబంధు, రైతు బీమా అందిస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలుకాని పథకాలు సీఎం అమలు చేస్తున్నారని వివరించారు. అంతకుముందు వార్డు సభ్యుల సంఘం క్యాలెండర్‌ను ఆవిషరించారు.కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీరాం శ్యాం, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు కడవేర్గు మమత, ఉప సర్పంచ్ శ్రీనివాసరావు, వార్డు సభ్యులు పొట్టాల మల్లేశ్, రాజ్ కుమార్, మధుసూదన్, భాగ్య, లక్ష్మి, శారద, మోటం లక్ష్మి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు శంకర్, మాజీ గ్రంధాలయ డైరెక్టర్ కొడిగుటి మొగిలయ్య ఉన్నారు.
అనాథలను ఆదరించాలి
హుజూరాబాద్‌టౌన్, జనవరి 20: అనాథలను చిన్న చూపు చూడకుండా ప్రేమతో ఆదరించాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం పట్టణంలోని మధువని గార్డెన్లో బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో అనాథ బాలల పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక అధ్యక్షత వహించగా హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బల్మూరి వెంకటనర్సింగారావు, ధర్మరాజుపల్లి సర్పంచ్ ఎం లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి సొల్లు బాబు, సీనియర్ కళాకారుడు వీ గోపాల్‌రావు, బాల వికాస సంస్థ ప్రతినిధులు లతారెడ్డి, ఖాజాబీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండ శ్రీనివాస్ మాట్లాడుతూ బాలవికాస సంస్థ అనాథల కోసం చేస్తున్న సేవలకు సహాయసహకారాలు అందిస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనాథలను ఆదుకునేందుకు రూపొందిస్తున్న నూతన చట్టంతో వారికి ప్రయోజనం కలుగుతుందని గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. అనాథలకు మానసిక సె్థైర్యాన్ని ఇవ్వడానికి అన్నలా అండగా నిలుస్తానని బల్మూరి వెంకట్‌నర్సింగారావు అన్నారు. ప్రతి ఒకరూ అనాథలకు సహాయసహకారాలు అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ కోరారు. అనంతరం అనాథ పిల్లలు కేక్ కట్‌చేసి పంచి పెట్టారు. నాయకులు, బాలవికాస సంస్థ సభ్యులు, పిల్లలు పాల్గొన్నారు.