పెద్దపల్లి, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయంలో క్రాప్ బుకింగ్, పీఎం కిసాన్ ఈ-కేవైసీ, రైతు బీమా విభాగాల్లో రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా అద్వితీయంగా దూసుకెళ్తున్నది. ఈ మూడు విభాగాలను ప్రథమ ప్రాధాన్యాలుగా తీసుకుని ఏ జిల్లాలో ఎలా అమలవుతున్నాయనే విషయమై రాష్ట్ర వ్యవసాయశాఖ ఇటీవల సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా క్రాప్ బుకింగ్‌కు 40, పీఎం కిసాన్ ఈ-కేవైసీకి 30, రైతు బీమాకు 30 చొప్పున పాయింట్లు కేటాయించగా, మొత్తం 100కు 64.58 పాయింట్లు సాధించి 32 జిల్లాల్లో రెండో స్థానంలో నిలిచింది. రైతు బీమా అమలులో 26.93 పాయింట్లతో ప్రథమ స్థానం సాధించింది. కాగా, రైతులకు సాగులో ఉత్తమ సేవలందిస్తూనే ఆయా విభాగాల్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది ఆదర్శంగా నిలుస్తున్నారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవసాయానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ముం దుకు సాగుతున్నది. దేశంలో ఎకడా, ఏ రాష్ట్రం లో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. వ్యవసాయంలో క్రాప్ బుకింగ్, పీఎం కిసాన్ ఈకేవైసీ, రైతు బీమా విభాగాలను ప్రథమ ప్రాధాన్యాలుగా గుర్తించి, రాష్ట్ర వ్యాప్తంగా అమలు విషయమై వ్యవసాయశాఖ గత రెండు నెలలుగా సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా క్రాప్ బుకింగ్‌కు 40 పాయింట్లు, పీఎం కిసాన్ ఈ-కేవైసీకి 30, రైతు బీమాకు 30 చొప్పున పాయింట్లు కేటాయించింది. సర్వేలో ఆదిలాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, పెద్దపల్లి రెండో స్థానంలో నిలిచింది. 100కు 64.58 పాయింట్లు సాధించింది. కాగా, రైతు బీమా అమలులో ఆదిలాబాద్ జిల్లా కంటే 0.46 పాయింట్లు ఎక్కువగా సాధించి 26.93 పాయింట్లతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ
వ్యవసాయ పథకాల అమలులో పెద్దపల్లి జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపుతున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా, రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యు త్, అందుబాటులో విత్తనాలు, ఎరువులతో పాటు ధాన్యం కొనుగోళ్లకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నది. సాగునీటిని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు చెరువులు, కుంటలు, కాల్వల మరమ్మతు పూర్తి చేస్తూ వినియోగంలోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో జిల్లాలో క్ర మంగా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. ఈ వానకాలంలో జిల్లావ్యాప్తంగా 1.34 లక్ష ల ఎకరాల్లో వరి, పత్తి, ఇతర పంటలు సాగయ్యా యి. రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోకుం డా పంట ఉత్పత్తులను సరారే కొనుగోలు చేస్తున్నది. కాగా.. జిల్లాలో అధికంగా వరి, పత్తి సాగవుతున్నది.
100కు 64.58 పాయింట్లు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథ కాలను వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయి లో అందేలా గొప్పగా పనిచేస్తున్నారు. వాన కాలం, యాసంగి రెండు సీజన్లలో విత్తనాల పం పిణీ మొదలుకొని కొనుగోళ్ల వరకు సేవలు అం దిస్తున్నారు. జిల్లాలో 54 వ్యవసాయ క్లస్టర్లుం డ గా.. రైతులు అధికారులు, సిబ్బంది సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు. రైతులకు వివిధ సేవలు అందించడంలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది. మొత్తం 100 పాయింట్లకు పెద్దపల్లి జిల్లా 64.58 పాయింట్లు సాధించింది. క్రాప్ బుకింగ్‌కు 40 పాయింట్లకు గాను 15.17, పీఎం కిసాన్ ఈకేవైసీ ఆధార్ అనుసంధానంలో 30 పాయింట్లకు గాను 22.48, కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన వారందరినీ రైతుబీమాకు నమోదు చేయించడా నికి ఉన్న 30 పాయింట్లకు గాను 26.93 చొప్పు న పాయింట్లను పెద్దపల్లి వ్యవసాయశాఖ సాధిం చింది. రైతు బీమా అమలులో మాత్రం రాష్ట్రం లోనే పెద్దపల్లి జిల్లా 26.93 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా వ్యవసాయశాఖ అధి కారులు రెండు నెలలుగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన ప్రతి రైతుకు రైతుబీమా, వాన కాలంలో రైతులు ఎన్ని ఎకరాల్లో ఏఏ పంటలు సాగు చేస్తున్నారనే విషయాలను తెలుసుకునేం దుకు క్రాప్ బుకింగ్, పీఎం కిసాన్ పథకం అమ లులో భాగంగా రైతుల పట్టా దారు పాసుపుస్తకం, ఆధార్ అనుసంధానం కార్యక్రమాలను విజయ వంతంగా చేపట్టారు.
సిబ్బంది విధి నిర్వహణ, రైతుల సహకారంతోనే..
ప్రభుత్వం వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రైతులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో క్రమశిక్షణతో పనిచేస్తుండగా.. రైతులు మంచి సహకారాన్ని అందిస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు పథకాల గురించి రైతులకు అవగాహన కల్పించడంతోపాటు రైతులకు పంటల సాగులో సలహాలు, సూచనలు అందిస్తున్నారు. పథకాలను రైతులకు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారు. వివిధ అంశాల్లో రైతులకు సేవలు అందించినందుకు పెద్దపల్లి జిల్లా రెండో స్థానంలో నిలువడం చాలా ఆనందంగా ఉంది.
– దోమ ఆదిరెడ్డి, వ్యవసాయశాఖ అధికారి (పెద్దపల్లి)