హుజూరాబాద్ టౌన్, జూలై 22: హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో, మధువని గార్డెన్స్‌లో హుజూరాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, బుడగజంగాలకాలనీలో బల్దియా చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, కాకతీయకాలనీలో వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మలాశ్రీనివాస్, హనుమాన్ దేవాలయం వద్ద ఆలయ కమిటీ చైర్మన్ బాపురావు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ దేవాలయంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కేక్‌లు కట్ చేసి, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మొక్కలు నాటారు. ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, ముక్క రమేశ్, మొలుగు సృజనాపూర్ణచందర్, కేసిరెడ్డి లావణ్య, అపరాజ ముత్యంరాజు, కల్లెపల్లి రమాదేవి, పీఏసీఎస్ చైర్మన్ ఎడవెల్లికొండల్రెడ్డి, నాయకులు పోరెడ్డి రజిత, శంతన్‌రెడ్డి, బీఎస్ ఇమ్రాన్, ఎండీ ముస్తాఫా, కొలిపాక అజయ్, కే మహేందర్‌యాదవ్, ఎం రమేశ్‌యాదవ్, పాకాల మధుకర్ రెడ్డి, విడపు రాజు, అనురాగ్, తొగరు భిక్షపతి, శివకుమార్, కత్తెరమట్ల సదానందం, ఎస్ మైకెల్, లక్ష్మణమూర్తి, అనిల్, కే శ్రీనివాస్, శ్రావణ్, రమేశ్, పావనీగౌడ్, విష్ణుదాస్ గోపాల్‌రావు, రెవరెండ్ ఎం ప్రకాశ్, ఎం బాలస్వామి, ఎం సురేందర్, ఎం రాజ్‌కుమార్, జీ నవీన్‌కుమార్, డీ జాన్ ఎస్వీ, ఇమ్మాన్యుయేల్, కే దేవదాస్, ఎన్ ప్రవీణ్, ఏ రవీందర్, ఎన్ ఉదయ్‌కుమార్, కే రాజు తదితర పాస్టర్లు పాల్గొన్నారు.
తుమ్మనపల్లిలో..
హుజూరాబాద్ రూరల్, జూలై 22: మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రతాప్‌రెడ్డి, ఉప సర్పంచ్ బేతి రాజిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు గొడిశాల పావని, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంటలో..
జమ్మికుంట, జూలై 22: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ జన్మదిన వేడుకలను జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చౌక్ వద్ద కేక్ కట్ చేశారు. తర్వాత నాయకులు మాట్లాడారు. వినోద్‌కుమార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. ఎంపీగా, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఆయన సేవలను కొనియాడారు. వినోద్‌కుమార్ మరెన్నో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇక్కడ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్నాకోటి, పీఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ టంగుటూరి రాజ్‌కుమార్, కౌన్సిలర్లు పొనగంటి మల్లయ్య, బొంగోని వీరన్న, మారెపల్లి భిక్షపతి, ఎలంగందుల స్వరూపాశ్రీహరి, పిట్టల శ్వేతారమేశ్, శ్రీపతి నరేశ్, కుతాడి రాజయ్య, రావికంటి రాజ్‌కుమార్, గండ్రపల్లి సర్పంచ్ పద్మాసమ్మారావు, నాయకులు రాజేశ్వర్‌రావు, కుమారస్వామి, శ్రీనివాస్, నవీన్‌కుమార్ పాల్గొన్నారు.
ఇల్లందకుంటలో..
ఇల్లందకుంట, జూలై 22: మండల కేంద్రంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 101 కొబ్బరికాయలు కొట్టారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు ఎక్కటి సంజీవరెడ్డి, దాంసని కుమార్, ఐలయ్య, సర్పంచులు జిల్లేల తిరుపతిరెడ్డి నాయకులు ఓదెలు, శ్రీకాంత్, ప్రశాంత్, రత్నాకర్, రణధీర్, హరీశ్, శ్రీకాంత్, రమేశ్, నవీన్, రాజిరెడ్డి, కౌశిక్, జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వీణవంకలో..
వీణవంక, జూలై 22: మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ జన్మదినం సందర్భంగా ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాలాసాధవరెడ్డి, ఏఎంసీ చైర్మన్ వాల బాలకిషన్‌రావు స్థానిక నాయకులతో కలిసి కేక్‌కట్ చేశారు. స్వీట్లు పంచారు. కార్యక్రమంలో కో ఆప్షన్‌మెంబర్ హమీద్, ఆయా గ్రామాల సర్పంచులు నీల కుమారస్వామి, కొత్తిరెడ్డి కాంతారెడ్డి, పోతుల నర్సయ్య, పర్లపెల్లి రమేశ్, ఉప సర్పంచులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, వోరెం భానుచందర్, నాయకులు చదువు మహేందర్‌రెడ్డి, నర్సింహా రెడ్డి, సత్యనారాయణ, గెల్లు మల్లయ్య, మధు, రవి, సురేశ్, దాసారపు లక్ష్మణ్, ప్రభాకర్, రాములు, క్రాంతి, ప్రకాశ్, రాజయ్య, చరణ్, కరుణాకర్ పాల్గొన్నారు.
మాచనపల్లిలో..
జమ్మికుంట రూరల్, జూలై 22: మండలంలోని మాచనపల్లి గ్రామంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. స్వీట్లు, పండ్లను పంచారు. ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను అందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు పర్లపల్లి నాగరాజు, ఎంపీటీసీ పొల్సాని రాజేశ్వర్‌రావు, బొజ్జం తిరుపతిరెడ్డి, పింగిళి సతీశ్‌రెడ్డి, నునుగుపల్లి రమేశ్, కోడూరి లక్ష్మయ్య, సముద్రాల సంపత్, పర్లపల్లి విష్ణు, అజయ్, శివ, సిద్ధు, కుశుల్, రాజ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
బిజిగిరిషరీఫ్ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు
బిజిగిరిషరీఫ్ దర్గాలో ఆర్భీఎస్ జిల్లా సభ్యుడు కనపర్తి లింగారావు ఆధ్వర్యంలో నాయకులు, ప్రజాప్రతినిధులు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చాదర్లు సమర్పించారు. ఇక్కడ సర్పంచ్ రాచపల్లి సదయ్య, మాజీ సర్పంచ్ యుగేందర్ రెడ్డి, ఆర్బీఎస్ గ్రామ సభ్యుడు మొండయ్య, దర్గా కమిటీ సభ్యులు నయీముద్దీన్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.