భోపాల్: సీనియర్ ఐఏఎస్ అధికారి అవీ ప్రసాద్ ముచ్చటగా మూడోసారి వివాహం చేసుకోవడం మధ్యప్రదేశ్ పరిపాలన, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన పెండ్లి చేసుకున్న ముగ్గురు వ్యక్తులు ఐఏఎస్ అధికారిణులే కావడం విశేషం.
ప్రసాద్ తాజాగా 2017 బ్యాచ్‌కు చెందిన అంకితా ధాక్రేను ఫిబ్రవరి 11న పరిణయమాడారు. ఆయన మొదటి వివాహం ఐఏఎస్ అధికారిణి రిజూ బాఫ్నాతో జరిగింది. కొన్నేండ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి మిషా సింగ్‌ను ఆయన పెండ్లి చేసుకున్నారు. నాలుగేండ్ల తర్వాత ఈ జంట విడిపోయింది.