జమ్మికుంట, జూలై 22: ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడే అంటువ్యాధులు దరి చేరవని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, కమిషనర్ సమ్మయ్య పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో డ్రై డే నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలన్నీ కలియతిరిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రోజుల తరబడి నీరు నిల్వ ఉండడం మంచిది కాదని, వారంలో ఒకసారి ఇంట్లో నిల్వ ఉన్న నీటిని పారబోయాలని సూచించారు. చెత్తాచెదారం రోడ్ల మీద పారవేయోద్దని, మున్సిపల్ వాహనాలు వచ్చినప్పుడు అందులో వేయాలని సూచించారు. కార్యక్రమంలో పలు వార్డులకు చెందిన కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, వైద్య, ఆరోగ్య సిబ్బంది, మెప్మా ఆర్పీలు, తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
రామడుగు, జూలై 22: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెలిచాల సర్పంచ్ వీర్ల సరోజన సూచించారు. వెలిచాలలో శుక్రవారం ఆమె వీధుల్లో కలియ తిరిగి నీటి గుంతల్లో పంచాయతీ సిబ్బందితో కలిసి ఆయిల్బాల్స్ వేశారు. కాగా, షానగర్లో వరద నీరు నిలిచి ఉన్న గుంతల్లో ఆరోగ్య సిబ్బంది ఆయిల్బాల్స్ వేశారు. కార్యక్రమంలో రామడుగు పీహెచ్సీ సీహెచ్వో నారాయణ, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.