గంభీరావుపేట, జూలై 17: గంభీరావుపేట మండలంలోని సింగసముద్రం చెరువు పరవళ్లు తొక్కుతున్నది. చెరువు నిండుకుని ఐదు అంతస్తుల మత్తడిపై నుంచి దిగువకు పరుగులు పెడుతూ సందర్శకులను ఆకట్టుకుంటున్నది. చెరువు వద్దకు వెళ్లే దారిలో ప్రమాదాలకు తావు లేకుండా సర్పంచ్ రాజిరెడ్డి మరమ్మతులు చేయించారు. సింగసముద్రం చెరువు వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పర్యాటకులు ఎవరు సందర్శించవద్దని ఎస్ఐ మహేశ్ తెలిపారు.