కమాన్‌చౌరస్తా, డిసెంబరు 9: నగరంలోని పలు ఆలయాల్లో మార్గశిరమాస సుబ్రహ్మణ్యషష్ఠి పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య, అనంతనాగేంద్ర, నాగ విగ్రహాలు గల ఆలయాల్లో జరిగిన అభిషేక అర్చనల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భగత్‌నగర్ హరిహర క్షేతం అయ్యప్పస్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు మంగళంపల్లి రాజేశ్వర శర్మ, డింగరి చాణక్య, శ్రీనివాస్, గోపాల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య స్వామికి ఫలపంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్ బేల్‌సింగ్, ఈవో కాంతారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, కమాన్‌రోడ్డు రామేశ్వరాలయంలో 100 లీటర్ల పాలతో అభిషేకం జరిపి, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి పోకల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. అశోక్‌నగర్ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో జరిగిన పూజల్లో ఆలయ అధ్య క్ష, కార్యదర్శులు చిట్టుమల్ల శ్రీనివాస్, కాచం రాజేశ్వర్, బొల్లం శ్రీనివాస్, రాచమల్ల భద్రయ్య, డైరెక్టర్లు పాల్గొన్నారు. రాంపూర్ గిద్దెపెరుమాళ్ల ఆలయంలో సిద్ధిబుద్ధి గణపతి నూతన ఉత్సవ విగ్రహాల స్థాపనతో పాటు సుబ్రహ్మణ్యస్వామికి అభిషేక అర్చనలు జరిగాయి. కార్యక్రమంలో పురా ణం మహేశ్వరశర్మ, రామక శంకరశర్మ, సేవకుడు కలర్ నత్తన్న, కార్పొరేటర్ మర్రి భావనాసతీశ్ పాల్గొన్నారు. పాతబజార్ గౌరీశంకరాలయం, బొమ్మకల్ రోడ్డు యజ్ఞవరాహ క్షేత్రం, చైతన్యపురి మహాశక్తి దేవాలయం, జ్యోతినగర్ హనుమాన్ సంతోషిమాత, భగత్గనర్ అంజనాద్రి ఆలయా ల్లో జరిగిన అభిషేక అర్చనలు చేశారు.