హుజూరాబాద్టౌన్, జూలై 13: దళిత బంధు యూనిట్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ధనికులు కావాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. హుజూరాబాద్ పట్టణంలో దళిత బంధు లబ్ధిదారు అకినపల్లి రజిత ఏర్పాటు చేసిన రైస్ డిపోను బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ, దళితులు పేదరికంతో ఇబ్బందులు పడుతున్నారని సీఎం కేసీఆర్ గుర్తించి దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అనంతరం లబ్ధిదారులను అతిథులు, వారిని లబ్ధిదారులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తోట రాజేంద్రప్రసాద్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.