మానకొండూర్ రూరల్, జూలై 13: రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం తపిస్తున్నారు. జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తెల్లారకముందే పల్లె పర్యటనను ప్రారంభిస్తున్నారు. చేతిలో గొడుగు పట్టుకొని ఎలాంటి ఆర్భాటం, హంగు లేకుండా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి, సీఎం సహాయనిధి చెక్కులు అందిస్తున్నారు. బుధవారం ఆయన మానకొండూర్ మండలం ఖాదరగూడెం, గంగిపల్లి, కొండపల్కల గ్రామాల్లోకి వెళ్లారు. లబ్ధిదారుల ఇండ్లకు చేరుకొని కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు లబ్ధిదారుల కుటుంబీకులు బొట్టుపెట్టి సాదర స్వాగతం పలికారు.
ఇంటికి వచ్చిన ఆత్మీయ అతిథికి వారు కృతజ్ఞతలు చెప్పారు. అలాగే, ఆయాచోట్ల వరద పరిస్థితిపై ఆరా తీశారు. దెబ్బతిన్న ఇండ్లు, విరిగిపడ్డ కరెంట్ స్తంభాలను పరిశీలించారు. అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం గంగిపల్లిలో ఇటీవల మృతి చెందిన బొంపెల్లి సత్తయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. అధైర్యపడవద్దని ఇల్లు కట్టించి ఆదుకుంటానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో సర్పంచులు నల్ల వంశీధర్ రెడ్డి, సాయవేని రాజు, మాశం శాలిని-సాగర్, జడ్పీటీసీ శేఖర్‌గౌడ్, ఎంపీటీసీ కనవేని శ్రీనివాస్, ఉప సర్పంచ్ తోట రాజమౌళి, మానకొండూర్ సొసైటీ వైస్ చైర్మన్ పంజాల శ్రీనివాస్, ఆర్బీఎస్ కో-ఆర్డినేటర్ కడారి ప్రభాకర్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు బొల్లం శ్రీనివాస్, యూత్ మండలాధ్యక్షుడు అడప శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు బొంగొని రేణుక, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బండి సంపత్, నాయకులు మూల కరుణాకర్ గౌడ్, రెడ్డి సంపత్ రెడ్డి, గణపతి రెడ్డి, దూలం తిరుపతి, శాతరాజు యాదగిరి, గోస్కుల స్వామి, బండి రాయమల్లు, సుధాకర్, రాజు కుమార్, ముల్కల సుధాకర్ పాల్గొన్నారు.