జ్యోతినగర్, జూలై 13: లోతట్టు ప్రాంతాల్లోని వరద బాధితులకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అండగా నిలుస్తున్నారు. ఆశ్రయమిస్తూ వారిలో ధైర్యం నింపుతున్నారు. భారీ వర్షాలతో కడెం, ఎస్సారెస్సీ గేట్లు ఎత్తివేతతో ముందస్తు ప్రణాళికతో ఎమ్మెల్యే కోరుకంటి డివిజన్ కార్పొరేట్ల సహకారంతో మూడో డివిజన్ న్యూపోరట్‌పల్లిలో దాదాపు 100 కుటుంబాలను ఎన్టీపీసీ సీఎస్ఆర్ కమ్యూనిటీ హాల్, దేవీ గార్డెన్‌కు తరలించారు. ఐదో డివిజన్లోని ఇటుక బట్టీ ల కార్మికులను రెడ్డి ఫంక్షన్ హాల్లకు మంగళవారం రాత్రి తరలించి ఆశ్రయం కల్పించారు. అర్ధరాత్రి ఎమ్మెల్యే పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నీరు. ఎన్టీపీసీ టౌన్షిప్ నుంచి ప్రవహిస్తున్న పెద్ద కాలు వ నీళ్ల్లు ఇండ్లలోకి చేరే ప్రమాదం ఉందని ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపా రు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు బాధితులకు భోజన వసతి సమకూరుస్తామన్నారు. అధైర్యపడవద్దని, అవసరమైన వారికి వైద్య పరీక్షలు చేపడుతామని బాధితులకు ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే వెంట నగరపాలక మేయర్ డాక్టర్ అనిల్‌కుమార్, కమిషనర్ సుమన్‌రావు, డిప్యూటీ మేయర్ అభిషేక్‌రావు, కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, పెంట రాజేశ్, కో ఆప్షన్ సభ్యులు చెరుకు బుచ్చిరెడ్డి, నాయకులు వేణుమలాని ఉన్నారు.