తిమ్మాపూర్ రూరల్, జూలై 12: రాష్ట్ర సాంస్కృతికసారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మంగళవారం పలు గ్రామాల్లో పర్యటించారు. పొరండ్ల, మల్లాపూర్, రేణికుంట, అల్గునూర్‌లో మండల నాయకులతో కలిసి ముఖ్యమంత్రి సహాయనిధి, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఆడబిడ్డలకు చీరెలు బహూకరించారు. గ్రామస్తులను పలుకరిస్తూ.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, కార్పొరేటర్ సల్ల శారదారవీందర్, ఏఎంసీ మాజీ చైర్పర్సన్ ఎలుక అనిత, సర్పంచులు రెడ్డి త్రివేణి-తిరుపతిరెడ్డి, సతీశ్, బోయిని కొమురయ్య, ఎంపీటీసీ చింతల రజితాలక్ష్మారెడ్డి, పుప్పాల కనకయ్య, నాయకులు ఎలుక ఆంజనేయులు, అసోద శ్రీనివాస్, పారునంది జలపతి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.