జగిత్యాల/ జగిత్యాల అర్బన్/ జూలై 6 : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ 60వ పుట్టిన రోజును నియోజకవర్గంలో ఘనంగా జరిపారు. కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున కేకులు కట్ చేయడంతోపాటు సామాజిక సేవాకార్యక్రమాలు చేశారు. జిల్లా పరిషత్ క్యాంపు కార్యాలయంలో అర్బన్ జడ్పీటీసీ సంగెపు మహేశ్, రూరల్ ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, ప్యాక్స్ చైర్మన్లు మహిపాల్ రెడ్డి, సందీప్ రావుతో కలిసి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. టీఆర్ఎస్వై పట్టణాధ్యక్షుడు కత్తురోజు గిరి ఆధ్వర్యంలో తహసీల్ చౌరస్తాలో వేడుకలు ఘనంగా నిర్వహించగా, టీఆర్ఎస్వై జిల్లా అధ్యక్షుడు దావ సురేశ్ హాజరై కేక్ కట్ చేశారు. జగిత్యాల మున్సిపల్ టీఆర్ఎస్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఓల్డ్ బస్‌స్టాండ్ వద్ద అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ అధ్యక్షురాలు భోగ శ్రావణి ప్రారంభించారు. టీఆర్ఎస్ జగిత్యాల పట్టణ శాఖ అధ్యక్షుడు గట్టు సతీశ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు బోగోజి ముకేశ్ కన్నా ఆధ్వర్యంలో ఓల్డ్ హైసూల్లో రక్తదాన శిబిరానికి హాజరయ్యారు. స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో మొకలు నాటారు. అబ్దుల్ కలాం హెల్పింగ్ హ్యాండ్స్ బ్లడ్ డోనర్ సొసైటీ ఆధ్వర్యంలో రాయికల్‌లో టీఆర్ఎస్ నాయకులు రక్తదానం చేశారు. ఆయాచోట్ల ‘హ్యపీ బర్త్ డే సర్’ అంటూ ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లూ చల్లంగా ఉండాలంటూ దీవించారు.