Arrest | యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందన అరెస్ట్
Arrest | ప్రముఖ యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసినట్లు ఆమెపై ఫిర్యాదు చేశారు. ఆమెపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంతో శంషాబాద్ పోలీసులు ఆమెను సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
Arrest | హైదరాబాద్: జాగర్లమూడి మధుకర్, నందన (అన్నే రామ నందన) అనే భార్యాభర్తలు నందూస్ వరల్డ్ పేరుతో యూట్యూబ్ (Youtube) చానెల్ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. లండన్లో నివసిస్తున్న తెలుగు రాష్ట్రానినికి చెందిన వీరు రోజువారీ జీవిత విశేషాలు, ఫంక్షన్స్, ఇంటి పనులు, షాపింగ్, వంటలు, ట్రావెల్ వంటి వాటికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటారు. వీటితో వీరు వీక్షకులకు సుపరిచితులయ్యారు. లండన్లో (UK) ఉద్యోగాలు, వీసా ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారు. సుమారు వంద మంది నుంచి రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బాధితులు ఆంధ్రప్రదేశ్ (AP)లోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నందన, ఆమె భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వీరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆమె భారత్కు వచ్చిందని తెలుసుకున్న పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్టులో నందనను అదుపులోకి తీసుకున్నారు. నందన జనవరిలో విడుదలైన చిరంజీవి హిట్ సినిమా మన శంకర్ వరప్రసాద్ సినిమాలో నటించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

