Amazon Cargo Plane: రన్‌వే నుంచి దూసుకెళ్లిన కార్గో విమానం.. అయిదుగురు మృతి
Amazon cargo plane: అమెజాన్ కార్గో విమానం రన్‌వే దాటి దూసుకెళ్లింది. సమీపంలో ఉన్న కార్లను ఢీకొట్టింది. మియామి ఎయిర్‌పోర్టులో జరిగిన ప్రమాదంలో అయిదుగురు మృతి చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు.
మియామి: అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో .. అమెజాన్ కార్గో విమానం(Amazon Cargo Plane) కూలింది. రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఆ విమానం పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో అయిదురు మృతిచెందారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రన్‌వేపై దిగిన తర్వాత ఆ విమానం సమీపంలో పార్క్ చేసిన కార్ల వైపు దూసుకెళ్లిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. బోయింగ్ 767-300 కార్గో విమానం ప్యూర్టో రికాలోని లూయిస్ మునోజ్ మారిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. అయితే ప్రమాద ఘటన పట్ల దర్యాప్తు చేపట్టినట్లు అమెజాన్ సంస్థ పేర్కొన్నది. స్థానిక అధికారులతో ఈ అంశంపై చర్చిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. క్రాష్ సైట్ వద్ద దట్టమైన పొగలు వ్యాపించడంతో ఆ విమానాశ్రయంలో అన్నివిమానాలను గ్రౌండ్ చేస్తూ ఫెడరల్ ఏవియేషన్ శాఖ ఆదేశాలు ఇచ్చింది.
అయితే చనిపోయిన వ్యక్తులు విమానంలో వారా లేక గ్రౌండ్‌పై ఉన్నవారు మృతిచెందారా ఇంకా తెలియదు. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే రెస్క్యూ బృందం అక్కడకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. అయిదుగురిలో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు మియామి ఫైర్ చీఫ్ రాయిద్ జదల్లా తెలిపారు. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ఈ ఘటన పట్ల దర్యాప్తు చేపట్టనున్నది. 200 మంది అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పారు. కానీ విమానం నుంచి ఫ్యూయల్ లీక్ అవుతున్నట్లు చెబుతున్నారు.
🚨 Update: Deadly Cargo Plane Crash at Miami International Airport
At least five people have died and five others were injured after an Amazon Prime Air cargo aircraft overran the runway at Miami International Airport on Sunday afternoon, striking multiple vehicles and bursting… pic.twitter.com/6XLpT6mVaP
— FL360aero (@fl360aero) September 7, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

