కమాన్‌చౌరస్తా, అక్టోబర్ 14 : విదేశాల్లో ఉద్యోగాల కోసం ఈ నెల 17న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి తిరుపతిరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్‌కామ్), తెలంగాణ ప్రభుత్వంలోని కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ కింద రిజిస్టర్డ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా తెలంగాణ నుంచి అర్హత కలిగిన సెమీసిల్డ్ కార్మికులకు విదేశీ ప్లేస్మెంట్ సులభం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగా, దుబాయ్ (యూఏఈ)లో బైక్ రైడర్స్ (డెలివరీ బాయ్స్)కి ఉద్యోగావకశాలు ఉన్నట్లు తెలిపారు. అభ్యర్థు లు ఎస్ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలని, తప్పనిసరిగా పాస్‌పోర్ట్, మూడేళ్ల బైక్ డ్రైవింగ్ లైసెన్స్, 21-40 ఏండ్ల మధ్య ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జొమాటో, స్విగ్గీ, ఏదైనా ఫుడ్ డెలివరీలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు 17న గురువారం ఉదయం 9 గంటలకు నగరంలోని శ్వేత హోటల్లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. వివరాకలు 94400 51285, 94400 48500, 97010 40062, 94400 51452 నంబర్లలో సంప్రదించాలని చెప్పారు.