మెరుగైన సేవలందిస్తాం
వాహనదారులకు మెరుగైన సేవలు అందిస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పురుషోత్తం తెలిపారు. ఆ మేరకు రవాణా శాఖ కార్యాలయాల్లో ప్రక్షాళన చేపడుతామని స్పష్టం చేశారు. రవాణా శాఖ తరఫున ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
- ఉమ్మడి జిల్లా డీటీసీ పురుషోత్తం
- బాధ్యతలు స్వీకరణ
తిమ్మాపూర్, ఫిబ్రవరి 19: వాహనదారులకు మెరుగైన సేవలు అందిస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పురుషోత్తం తెలిపారు. ఆ మేరకు రవాణా శాఖ కార్యాలయాల్లో ప్రక్షాళన చేపడుతామని స్పష్టం చేశారు. రవాణా శాఖ తరఫున ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రవాణా శాఖ తరఫున రెవెన్యూ టార్గెట్ను వంద శాతం పూర్తి చేసి, తమ లక్ష్యాన్ని అధిగమిస్తామని చెప్పారు. హనుమకొండ నుంచి బదిలీపై వచ్చిన ఆయన, సోమవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా డీటీసీగా తిమ్మాపూర్లోని రవా ణా శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయనకు ఉమ్మడి జిల్లాలోని ఎంవీఐలు, రవాణా శాఖ సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడారు. సమ్మక జాతరకు వెళ్లే వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎకించుకోవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్డుపై ప్రయాణించే వాహనాలు తప్పకుం డా రవాణా శాఖ నిబంధనల మేరకు అన్ని పత్రాలు కలిగి ఉండాలన్నారు. అధికారులు తనిఖీ చేసినప్పుడు వాహన టాక్సీ, ఫిట్నెస్, డ్రైవర్ లైసెన్సు, వాహన ఇన్సూరెన్స్తో పాటు అన్ని పత్రాలు సక్రమంగా ఉండాలని, లేని పక్షంలో సీజ్ చేసి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. కాగా, డీటీసీతోపాటు ఎంవీఐలు రవికాంత్, శ్రీకాం త్, ఏఎంవీఐ స్రవంతి బాధ్యతలు స్వీకరించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

