Godavarikhani | కోల్ సిటీ, జూలై 26: రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక లయన్స్ క్లబ్ భవన్ లో శనివారం సాయంత్రం భరత మాత చిత్రపటానికి పూలమాల వేసి కార్గిల్ యుద్ధంలో అమరులైన దేశ సైనికులకు నివాళులర్పించారు. విజయ్ దివస్ కు గుర్తుగా మాజీ సైనికులు అంజయ్య, కుమారస్వామిని ఘనంగా సత్కరించారు. దేశానికి అందించిన సేవలను కొనియాడారు.
క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ 1993లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించిందని తెలిపారు. ఈ యుద్ధానికి ఆపరేషన్ విజయ్ అని పేరు పెట్టారని, కార్గిల్ లో జరిగిన ఈ యుద్ధంలో వీర మరణం పొందిన అమర సైనికుల కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు అంజనేయులు, కార్యదర్శి సారయ్య, కోశాధికారి రాజేంద్రకుమార్, సీనియర్ లయన్స్ మేడిశెట్టి గంగాధర్, తిలక్ చక్రవర్తి, బంక రామస్వామి, ఎల్ రమణారెడ్డి, సత్యనారాయణ, గుండా రాజు తదితరులు పాల్గొన్నారు.