నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు
నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సౌకర్యాలతో నందిమేడారంలో 30పడకల దవాఖాన భవనాన్ని నిర్మిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, సీనియర్ సిటిజన్స్, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
- నందిమేడారంలో 30పడకలతో దవాఖాన నిర్మాణం
- రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
- పనులు పరిశీలించి నాణ్యత పాటించాలని ఆదేశం
- బొట్లవనపర్తిలో కంటి వెలుగు శిబిరం సందర్శన
ధర్మారం, ఏప్రిల్ 3: నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సౌకర్యాలతో నందిమేడారంలో 30పడకల దవాఖాన భవనాన్ని నిర్మిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, సీనియర్ సిటిజన్స్, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన నందిమేడారం, బొట్లవనపర్తి గ్రామాల్లో పర్యటించారు. నందిమేడారం పీహెచ్సీ ఆవరణలో 5.75లక్షలతో నిర్మిస్తున్న 30పడకల దవాఖాన పనులను పరిశీలించి, మాట్లాడారు. పనులు నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
మండల ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించడానికి దవాఖాన నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు చెప్పారు. అనంతరం బొట్లవనపర్తిలోని రైతు వేదికలో నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాన్ని సందర్శించారు. కంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఆ గ్రామానికి చెందిన దారవేని కొమురయ్యను అడిగి తెలుసుకున్నారు. ప్రజలంతా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

