చిగురుమామిడి, ఏప్రిల్ 22: రైతు ఆరుగాలం రైతులు కష్టించి పండించిన ధాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ఎస్ఎంసి చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ఎంపీడీవో విజయ్ కుమార్, సింగిల్ విండో కార్యాలయ సీఈఓ నర్సయ్య, పర్సన్ ఇంచార్జ్ వనజ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రేకొండ, బొమ్మనపల్లి, సుందరగిరి, నవాబుపేట, సీతారాంపూర్ గ్రామాల్లో సింగిల్ విండో ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులతో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయిస్తే న్యాయమైన ధర లభిస్తుంద న్నారు.
దళారులను ఆశ్రయించి ప్రైవేట్ వ్యక్తులకు విక్రయిస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ జంగా వెంకట రమణారెడ్డి, ఏవో పున్నం చందర్, ఆయా గ్రామాల సర్పంచ్ లు అల్లేపు సంపత్, కొంకట మౌనిక, జంగ శిరీష, గూళ్ల రజిత, గోవూరి లక్ష్మి, మాజీ జెడ్పిటిసి గీకురు రవీందర్, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, ఏఈఓ లు అఖిల, అంజలి, సాయికుమార్, ఫరీద్, సింగిల్ విండో కార్యాలయ సిబ్బంది చేపూరి కుమారస్వామి, పోతరవేణి శ్రీనివాస్,గందె పవన్, వివిధ పార్టీల నాయకులు, రైతులు పాల్గొన్నారు.