veernapally | వీర్నపల్లి, సెప్టెంబర్ 26 : బెహరాన్ లో గుండెపోటుతో ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్లకు చెందిన దేవోల్ల హన్మాంతు (35) పదిహేను నెలల క్రితం ఉపాధి నిమిత్తం బెహరన్ వెళ్లాడు. శుక్రవారం ఉదయం తన గదిలో ఉండగా చాతిలో నొప్పి ఉందని మిత్రులతో చెప్పాడు.
వారు దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య సుమలత కూతుర్లు ఇందు, లాస్య ఉన్నారు. మృతదేహాన్ని స్వదేశానికి త్వరగా రప్పించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఒడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు గోగుల రమేష్ కోరారు.