ఫర్టిలైజర్సిటీ, ఫిబ్రవరి 12: కామారెడ్డి జనరల్ దవాఖానలో ఐసీయూలో ఉన్న షేషెంట్ని ఎలుకలు కొరికిన ఘటనలో వైద్యులను బాధ్యులను చేసి సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ దవాఖాన ఎదుట తెలంగాణ ప్రభుత్వ బోధన వైద్యుల సంఘం ఆధ్వర్యంలో వైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ దవాఖానలో శానిటైజేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు వైద్యుడికి ఎలాంటి సంబంధం లేనప్పటికీ సస్పెండ్ చేయడం దారుణమన్నారు. వెంటనే సస్పెన్షన్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో బోధన సంఘం గోదావరిఖని శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శిరీష, కోశాధికారి డాక్టర్ ఫరీద్, ఉపాధ్యక్షులు డాక్టర్ అనూష, రవివర్మ, వైద్యులు శ్రీధర్, అఖిల్ పాల్గొన్నారు.