Tiles Work Association | కమాన్ పూర్, జులై 27: కమాన్ పూర్ మండల టైల్స్ వర్క్ అసోసియేషన్ నూతన కమిటీ కార్యవర్గాన్ని మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గాండ్ల రవి, ఉపాధ్యక్షులుగా రేవిల్లి రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎస్ కే బాషా, కోశాధికారిగా గజ్జెల శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులుగా ఈదునూరి వంశీ కృష్ణ, దుర్కి హరీష్, దుర్కి సతీష్, నగునూరి కిరణ్, కొట్టకొండ కిరణ్, కోరే సతీష్, మూసపురి రాజు, మహేందర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యలు మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని, అసోసియేషన్ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి శాయశక్తుల కృషి చేస్తామని, ప్రతీ నెల అసోసియేషన్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టైల్స్ వర్క్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.