జగిత్యాల, డిసెంబర్ 16 : రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ప్రజాప్రతినిధులు పని చేయాలని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సూచించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో జగిత్యాల నియోజకవర్గంలోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ఆయన మంగళవారం ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర చాలా ముఖ్యమని, ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా గ్రామ పంచాయతీ అకౌంట్లోకి నిధులు వస్తాయని, సర్పంచులు, పాలకవర్గ సభ్యులు ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
దావ వసంత మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసీఆర్‌ని మళ్లీ ముఖ్యమంత్రిని చేసే వరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల, పట్టణాధ్యక్షులు ఆనంద్ రావు, తుమ్మ గంగాధర్, నేరెళ్ల సుమన్ గౌడ్, తేలు రాజు, ఎలిగేటి అనిల్‌కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్‌రావు, ఉపాధ్యక్షుడు వొళ్లెం మల్లేశం, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శీలం ప్రవీణ్, కొలుముల రమణ, సాగి సత్యం రావు, బైరి మల్లేశ్, సాగర్‌రావు, బుర్ర ప్రవీణ్ గౌడ్, ఎల్లా రాజన్న, గంగారెడ్డి, తురగ శ్రీధర్‌రెడ్డి, జగన్, అనురాధ, మారంపెల్లి రాణి సాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు.