
Godavarikhani | గోదావరిఖని : పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహా నేత గా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు( కేసీఆర్ ) నిలిచిపోతారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వ్యాల్ల హరీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మ దినాన్ని పురస్కరించుకొని రామగుండం నియోజకవర్గం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మంగళవారం కేక్ కట్ చేసి, పేదలకు పండ్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యాల్ల హరీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సంకల్పమే దీక్షగా స్వాభిమానాన్ని శ్వాసగా మార్చిన ఉద్యమ మహానేత, స్వరాష్ట్ర సాధకుడు, పేదల భవిష్యత్తుకు బాటలు వేసిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం ఆనందదాయకం అన్నారు. పేదల పక్షపాతిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వ్యవసాయం దండగ అన్న వారి కళ్లు తెరిపించి రైతుబంధు పేరుతో దేశానికే దశాదిశా చూపిన మహా నాయకుడు కేసీఆర్ అన్నారు. రైతుల కన్నీళ్లు తుడిచి రైతు బాంధవుడిగా ఇప్పటికీ రైతుల గుండెల్లో కొలువైన ఉద్యమ నాయకుడు కేసీఆర్ కోసం ప్రజానికం ఎదురుచూస్తుంది అన్నారు.
స్వరాష్ట్ర సంకల్పమే ధ్యేయంగా ఉద్యమాన్ని రచించి తెలంగాణ సాధించి ప్రజల గుండెల్లో తెలంగాణ ‘బాపు’గా చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. రామగుండం నియోజకవర్గం పేద ప్రజల పక్షాన కెసిఆర్ బాపుకు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో Tbgks నాయకులు మాదాసి రామ్మూర్తి వడ్డేపల్లి శంకర్ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జాహీద్ పాషా, మాజీ కో-ఆప్షన్ తస్లీమ్ భాను, మాజీ కార్పొరేటర్లు బొబ్బిలి సతీష్, ఐత శివకుమార్, బక్కి కిషన్, బీఆర్ఎస్ యువజన విభాగ అధికార ప్రతినిధి బూరుగు వంశీకృష్ణ, కొండా సురేష్, పోయిల రవి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల రామస్వామి, మెరుగు చంద్రమౌళి, చొప్పరి శ్రీనివాస్, పోలాడి శ్రీనివాసరావు, పర్స స్వాతి, కడమల్ల శ్రీహరి, నడిపెల్లి సాయి, శ్రవణ్, బొట్ల పోషం, కృష్ణస్వామి, రోడ్డ సంపత్, రంగు దుర్గ ప్రసాద్, సిగిరి రాము, సురేందర్, దిగువ యాదగిరి, మామిడాల రాము, రుద్రారపులక్ష్మి, రాజమ్మ,సుమతి, అనిల్, యుగేందర్, శ్యామ్,కందుగుల రాజు, చత్రియ కమలాస్, సాయి, శివానందం తదితరులు పాల్గొన్నారు.