కర్షక బిడ్డ కేసీఆర్.. రైతు ద్రోహి రేవంత్
కాళేశ్వరం ప్రాజెక్టుతో పుష్కలమైన సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువులు ఇచ్చి కేసీఆర్ కర్షక బిడ్డగా నిలిస్తే, కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి జలాలు ఎత్తిపోసే అవకాశముండి సాగునీరివ్వకుండా రేవంత్ రైతు ద్రోహిగా మారారని, ప్రస్తుత కరువుకు అతడే కారణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి మండిపడ్డారు.
- ప్రస్తుత కరువుకు ప్రధాన కారకుడు ముఖ్యమంత్రే
- తెలంగాణకు శనిలా దాపురించిండు
- కన్నెపల్లి పంపుహౌస్ వద్ద నీటిని ఎత్తిపోసే అవకాశమున్నా నిర్లక్ష్యం చేస్తున్నడు
- మెట్పల్లిలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి
మెట్పల్లి రూరల్, జూలై 16: కాళేశ్వరం ప్రాజెక్టుతో పుష్కలమైన సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువులు ఇచ్చి కేసీఆర్ కర్షక బిడ్డగా నిలిస్తే, కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి జలాలు ఎత్తిపోసే అవకాశముండి సాగునీరివ్వకుండా రేవంత్ రైతు ద్రోహిగా మారారని, ప్రస్తుత కరువుకు అతడే కారణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయం, విద్య, వైద్య రంగాలను సీఎం నిర్వీర్యం చేస్తున్నారని, రేవంత్‌రెడ్డి తెలంగాణకు పట్టిన శని అని ధ్వజమెత్తారు.
మెట్పల్లి మండ లం వెల్లుల్ల శివారులోని ఓ గార్డెన్లో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ బీఆర్ఎస్ బీఎల్ఏలకు ‘సర్’పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించగా, ముఖ్య అతిథిగా జీవన్‌రెడ్డి హాజరై మాట్లాడారు. అధికార పార్టీ చేసే తప్పిదాలను ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షాలదేనని, కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆ బా ధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సంఘం ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘సర్’ ప్రక్రియ క్లిష్టంగా ఉందని, 2002 నిర్వహించినప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడు పెట్టిందన్నారు. సంచార జాతులు, వలస వచ్చిన వారికి ఈ ప్రక్రియ కష్టతరం గా ఉందని పేర్కొన్నారు. ఇవి వరినాట్లు ముగిసే రోజులని, కానీ కరువు ప్రభావంతో సగం కూ డా పూర్తి కాలేవని చెప్పారు. రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని, రాష్ట్రంలో ఏ ఊరికి వెళ్లినా ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలని’ అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. సీఎంను గద్దె దించే వరకు తన పోరాటం ఆగదని ప్రతినబూనారు.
కాంగ్రెస్‌తో బీజేపీ ములాఖత్: డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాం గ్రెస్‌తో బీజేపీ ములాఖత్ అయిందని కోరుట్ల ఎమ్మె ల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఆరోపించారు. ‘జై జవాన్.. జై కిసాన్’ అంటామని, అయితే కిసాన్‌ను మోసం చేసే వారు కూడా దేశ ద్రోహులే అవుతారని తెలిపారు. యూరియా ఇవ్వాల్సింది కేంద్రమని, అడగాల్సింది రాష్ట్ర ప్రభుత్వమని, మరి ఇవ్వని బీజేపీ, అడగని కాంగ్రెస్ రెండూ దేశ ద్రోహులేనన్నారు. సీఎం రేవంత్ జోకర్‌గా, మూర్ఖునిగా, విషపూరితంగా మా ట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రైతు సమస్యలపై మాట్లాడని బీజేపీ రేపిస్టులను సన్మానించే పార్టీగా మారిందని ఆరోపించారు. బీఎల్ఏలు సర్ ప్రక్రియలో పకడ్బందీగా పని చేయాలని సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితా చాలా కీలకమని, అర్హులైన ప్రతి ఓటరుకు ఓటుహక్కు కల్పించడంలో బీఎల్వోలను సమన్వయం చేసుకుంటూ బీఎల్ఏలు కృషి చేయాలని సూచించారు. శిక్షకులు, బీఆర్ఎస్ మండల నాయకులు, బీఎల్ఏలు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

