‘అగధ’ చిత్రం అమ్మవారి ఆశీర్వాదంతో బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు చిత్ర దర్శకుడు ఎం.ఎస్.రాజు. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి, బి.గోపాల్, సాయిరాజేష్, ఎస్కేఎన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ ‘లాస్ట్ ఓవర్లో 24రన్స్ కొట్టాలంటే మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ నేను సూపర్‌ఓవర్‌లా ఈ సినిమా తీశాను. అద్భుతమైన సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కించాం’ అన్నారు. ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించిందని, విజయంపై టీమంతా ధీమాగా ఉన్నామని నిర్మాత కాశీ విశాలాక్షి చెప్పారు. ఈ సినిమా ప్రయాణంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని, ఫీమేల్ లీడ్‌గా ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందని కథానాయిక కామాక్షి భాస్కర్ల పేర్కొన్నది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.