Vivek Venkataswamy | సుల్తానాబాద్ రూరల్, జూన్ 14: కాకా వెంకటస్వామి సేవలు మరువలేనివని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కొనియాడారు. మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా శనివారం చెన్నూరు నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి కి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో పార్టీ శ్రేణులు భారీ స్వాగతం పలికారు. శాలువాలను కప్పి సన్మానం చేశారు. ముందుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్, కాక వెంకటస్వామి విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . పెద్దపల్లి ప్రజలు కాక వెంకటస్వామి అంటే పార్లమెంటులోని ప్రజలందరికీ ఎంతో అభిమానం అన్నారు.
సింగరేణి సంస్థను బిఐఎఫ్ఆర్ నుండి కాపడి ఎన్టీపీసీ నుండి నాలుగువందల కోట్ల రూపాయలను కాకా ఇప్పించడం జరిగింది అన్నారు. సింగరేణి కార్మికులకు పెన్షన్ , సీఎంపీఎఫ్ సంస్థను ఏర్పాటు చేశారు. పెద్దపల్లి ప్రజల ఆశీర్వాదంతో 40 సంవత్సరాల నుండి ఎక్కువసార్లు కాక కుటుంబమే పెద్దపల్లి పార్లమెంటులో గెలుస్తూ వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు. సజ్జత్ , జగన్ , శ్రీనివాస్ , శంకర్, శ్యామ్, సంతోష్ లతోపాటు తదితన్నారు.