RGUKT | కమాన్ పూర్, జులై 5: తెలంగాణ లోని బాసర, మహబూబ్ నగర్ లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్ (RGUKT)లో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ (ఇంటర్, ఇంజనీరింగ్)కోర్సులలో ప్రవేశానికి పదో తరగతి మార్కుల ఆధారంగా జరిగిన ప్రవేశ ప్రక్రియలో జూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వైద్య శ్రీ వరుణ్, పెనగొండ హార్దిక్ ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత, ఉపాధ్యాయులు నాగరాజు, గంగారాం, శ్రీనివాస్, శిరోమణి, శ్రీదేవి, శ్రీలక్ష్మి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ స్వరూప, వీవో ప్రేమలత అభినందనలు తెలియజేశారు. తల్లిదండ్రులు వారి ఆనందాన్ని పంచుకున్నారు. జూలపల్లి పాఠశాల ప్రతీ సంవత్సరం దిన దినాభివృద్ధి చెందుతూ జిల్లా స్థాయిలో అద్భుత విజయాలు సాధిస్తుందని మెచ్చుకున్నారు.
గ్రామ కార్యదర్శి అంబటి శంకర్, మాజీ సర్పంచ్ బొల్లంపల్లి శంకర్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ పోల్దాసరి సాయి కుమార్, మాజీ ఎంపిటీసీలు శెవ్వ శంకరయ్య, వినోద, లయన్స్ క్లబ్ ఆఫ్ కమాన్ పూర్ అధ్యక్షుడు సాన రామకృష్ణా రెడ్డి విద్యార్థులను ఆశీర్వదించి అభినందించారు.