TUWJ (IJU) | జగిత్యాల, ఆగస్టు 15: ఐకమత్యంగా ఉంటేనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవుతాయని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు. 79 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో, ధరూర్ క్యాంపులో గల టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారి పాలన నుండి దేశ విముక్తి కోసం ఆనాడు ఎందరో మహానుబావులు ఐకమత్యంగా పోరాడటం, ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడకపోవడం వల్ల స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు.
అదేవిధంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఐకమత్యంగా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. రెండవసారి జిల్లా అధ్యక్షునిగా ఎన్నికై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఎగురవేయడం ఆనందంగా ఉందన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, తోటి జర్నలిస్టులకు 79 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాల చారి, దాడుల కమిటీ సభ్యులు ఆదిల్, జిల్లా ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, హైదర్ అలీ, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, సహాయ కార్యదర్శులు గుర్రం చంద్రశేఖర్, కోరేపు రాజ్ కుమార్, చింత నరేష్, కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్, శ్రీకాంత్, జమీర్ అలీ, తాండ్ర శంకర్ గౌడ్ సీనియర్ పాత్రికేయులు బొడ్డుపల్లి అంజయ్య, కొడిపెల్లి పురుషోత్తం రెడ్డి, అలిషెట్టి మదన్ మోహన్, కమలాకర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఆరీఫ్, ఎల్లాల రాజేందర్ రెడ్డి, దేవేందర్, సిరిసిల్ల రాజేందర్ శర్మ, సత్యనారాయణ, తోట హన్మంతు పటేల్, బైరీ రాజేష్, నారాయణ రెడ్డి, ఆనంద్, మారుతి, గంగాధర్, ఎండి జహీరొద్దీన్, షఫీ, ఫజల్, ఇక్రామొద్దీన్, సల్మాన్, సాబీర్, జిల్లా పాత్రికేయులు పాల్గొన్నారు.