Peddapally | పెద్దపల్లి, ఏప్రిల్ 24( నమస్తే తెలంగాణ): కాశ్మీర్లోని పెహల్గం లో జరిగిన ఉగ్రవాద దాడిలో మృతి చెందిన అమరుల ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద క్యాండిల్ లో వెలిగించి మౌనం పాటించారు. అహల్ఘం లో టెర్రర్ ఎటాక్ ను ఖండిస్తూ పెద్దపల్లి కమాన్ చౌరస్తా వద్ద క్యాండిల్ ర్యాలీ చేపట్టి ఈ సందర్భంగా ఉగ్ర దాడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
శాంతి స్థాపన కోసం జరుగుతున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఉగ్రదాడులకు పాల్పడడం అభివృద్ధికి తిలోదకంగా మారుతుందని వారు పేర్కొన్నారు. అమరులైన మృతుల కుటుంబాలు తమ సంతాపాన్ని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా జర్నలిస్టులు బెజ్జంకి నరేష్, కాల్వ రమేష్, అంకరి ప్రకాశ్, గుడ్ల శ్రీనివాస్, వీరమల్ల విద్యా సాగర్, పంది కుమార్, ఏర్రోజు వేణుగోపాల్, తంగళ్ళ పల్లి మధు, తిర్రి తిరుపతి, తిర్రి సుధాకర్, మొలుగురీ సాగర్, ఆర్కుటీ మల్లేష్. బొల్లాం వేణు, పేర్క నీరజ్, పోగుల విజయ్ తోపాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.