ఎడ్యుకేషన్ హబ్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎడ్యుకేషన్ హబ్‌గా మారింది. కేజీ టూ పీజీ వరకు.. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో అత్యుత్తమ విద్యకు నిలయంగా మారింది. ఏటా సాంకేతికంగా వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకుంటున్న విద్యా సంస్థలు, అందుకు అనుగుణంగా విద్యా బోధనలో మార్పులు తీసుకువచ్చి విద్యార్థులను అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో అత్యుత్తమ స్థానాల్లో నిలిపేందుకు కృషి చేస్తున్నాయి.
- విద్యాసంస్థలకు నిలయంగా ఉమ్మడి జిల్లా
- కేజీ నుంచి పీజీ వరకు ఉత్తమ విద్యాసంస్థలు
- అందుబాటులో ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలు
- అత్యుత్తమ ప్రమాణాల్లో విద్యాభోదన
- జాతీయ స్థాయలో విద్యార్థుల రాణింపు
కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 11: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎడ్యుకేషన్ హబ్‌గా మారింది. కేజీ టూ పీజీ వరకు.. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో అత్యుత్తమ విద్యకు నిలయంగా మారింది. ఏటా సాంకేతికంగా వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకుంటున్న విద్యా సంస్థలు, అందుకు అనుగుణంగా విద్యా బోధనలో మార్పులు తీసుకువచ్చి విద్యార్థులను అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో అత్యుత్తమ స్థానాల్లో నిలిపేందుకు కృషి చేస్తున్నాయి.
గతంలో ఉన్నత విద్య కోసం మెట్రోపాలిటన్ సిటీలు, ఇతర నగరాలకు విద్యార్థులు వెళ్లే పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు ఇతర ప్రాంతాల విద్యార్థులు మన దగ్గరి విద్యాసంస్థల్లో చేరే స్థాయికి ఉమ్మడి జిల్లా ఎదిగింది. కేజీ నుంచి ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల్లోనూ అద్భుతమైన బోధన అందుతున్నది. కరీంనగర్‌తోపాటు జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యాబోధన అందుతుండగా, విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ఇక ఇక్కడి పాఠశాలల్లో ఆటాపాటలతో పాటు అంతర్జాతీయ దినోత్సవాలు, పండుగలు విద్యార్థులకు తెలియజేసే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పలు పాఠశాలల్లో అకాడమిక్ సెలబస్‌తో పాటు విద్యార్థులకు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి అక్కడ పరిస్థితులను వివరిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాలు, మార్కెట్లు, దవాఖానలు, పోలీస్ స్టేషన్లు, తదితర వాటికి క్షేత్రస్థాయి పర్యటనలకు తీసుకెళ్తూ అవగాహన కల్పిస్తూ, పోటీ ప్రపంచంలో రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. సుధీర్ఘంగా ఉపన్యాసాలు ఇచ్చేలా తయారు చేస్తున్నారు. భారీ వేదికలపై విద్యార్థులు నిర్భయంగా మాట్లాడేలా తీర్చిదిద్దుతున్నారు.
జాతీయ, అంతర్జాతీయంగా వివిధ సంస్థలు నిర్వహించే ఎడ్యుకేషన్ఒలింపియాడ్స్, ఇతర పోటీ పరీక్షల్లోనే ఉమ్మడి జిల్లా విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను చూపించేలా విద్యాబోధన సాగిస్తున్నారు. వీటితోపాటు విద్యార్థుల్లో శారీరక ధృడత్వంగా ఉండే విధంగా వివిధ క్రీడల విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా కరాటే, జూడో తదితర స్వీయరక్షణ క్రీడలతో పాటు అవుట్ డోర్, ఇండోర్ క్రీడల్లోనూ పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

