JNTU | రామగిరి, ఏప్రిల్ 19: తెలంగాణ రాష్ట్రం లొని 12 విశ్వ విద్యాలయాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ జేఎన్టీయూ మంథని యంత్ర కళాశాలకు చెందిన కాంట్రాక్టు అధ్యాపకులు స్టేట్ కో ఆర్డినేటర్స్ పిలుపు మేరకు శనివారం నుంచి నిరవధిక సమ్మెను చేపట్టారు.
ఇందులో భాగంగా అధ్యాపకులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ లో ఉన్న మంత్రులైనటువంటి శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, సీతక్క తమ డిమాండ్లు న్యాయబద్దమైనవని చేప్పారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ న్యాయబద్దమైన డిమాండ్లను విస్మరించడం ఏమిటని వారు ప్రశ్నించారు.
గత 16 నెలలుగా మేము అందరి మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. గత వారం రోజులుగా వివిధ నిరసనలు తెలుపుతున్నప్పటకీ స్పందన రాకపోవడంతోనిరవధిక సమ్మెను చేపట్టామని చేపట్టినట్లు వారు తెలిపారు.