కమాన్‌చౌరస్తా, డిసెంబర్ 27 : ప్రముఖ సేవాసంస్థ ఎకనామిక్ గ్రోత్ ఫౌండేషన్ అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఉట్కూరి నరేందర్‌రెడ్డికి ‘జ్యూవెల్ ఆఫ్ ఇండియా’ అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో నరేందర్‌రెడ్డిని అధ్యాపకులు, ఉపాధ్యాయులు సిబ్బంది సత్కరించారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ, విద్యాసంస్థల ఆరంభం నాటి నుంచి ప్రతి విద్యార్థి ఉత్తమంగా అభ్యసించాలనే తపనతో నాణ్యమైన విద్యనందిస్తున్నామన్నారు.
అవార్డు రావడంపై నగరంలోని ప్రముఖులు, వాణిజ్య బృందాలు, విద్యావేత్తలు, అధికారులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, ట్రస్మా సభ్యులు నరేందర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యారంగ వ్యవస్థను అన్ని కోణాల్లో సంరక్షిస్తూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులను అత్యుత్తమ విద్యనందిస్తూ, ఉత్తమ ఫలితాలు సాధిస్తూ, భావితరాలకు ఉత్తమ పౌరులను అందిస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డు ప్రకటించినట్లు ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు.